: ఘనంగా లాల్ బహదూర్ శాస్త్రి జయంతి
మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 109వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఢిల్లీలోని విజయ్ ఘాట్ లో లాల్ బహదూర్ శాస్త్రి సమాధి వద్ద రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ, బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ, కేంద్ర మంత్రి కమల్ నాథ్ లతో పాటు మరికొంతమంది ప్రముఖులు నివాళులర్పించారు.