: పోలీసు వేషాల్లో వచ్చి..
మహరాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం నాసిక్ లో భారీ దోపిడీ జరిగింది. ఈ దోపిడీ వివరాల్లోకెళితే.. ఇక్కడి మణప్పురం గోల్డ్ ఫైనాన్స్ కార్యాలయానికి ఐదుగురు వ్యక్తులు పోలీసు దుస్తుల్లో వచ్చారు. వచ్చీరావడంతోనే సీసీటీవీ కెమెరాల కనెక్షన్లతోపాటు టెలిఫోన్, అలారమ్ వైర్లను కూడా కట్ చేశారు. అనంతరం సిబ్బందిని తుపాకులతో బెదిరించి, స్ట్రాంగ్ రూమ్ లోకి వెళ్ళి 15 కిలోల బంగారం, రూ.3 లక్షల నగదు ఎత్తుకెళ్ళారు. వెళ్ళేటప్పుడు సిబ్బందిని స్ట్రాంగ్ రూంలోనే బంధించారు. అంతకుముందే వారి వద్ద ఉన్న సెల్ ఫోన్లు లాగేసుకున్నారు. కాగా, కార్యాలయానికి వచ్చిన కస్టమర్లు పరిస్థితిని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి స్ట్రాంగ్ రూమ్ తలుపులను పగలగొట్టి సిబ్బందిని బయటికి తీసుకొచ్చారు. మణప్పురం ఫైనాన్స్ సంస్థ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాసిక్ నుంచి బయటికి వెళ్ళే అన్ని మార్గాలలోనూ తనిఖీలు చేపట్టారు.