: ముందుగా తెలుసుకుంటే మరణాన్ని ఆపవచ్చు


పైకి కనిపించకుండానే ప్రాణాలు తీసేయగల భయంకర వ్యాధి కేన్సర్. నేడు ప్రపంచవ్యాప్తంగా కేన్సర్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇందుకు ఆధునిక జీవనం, మారిన ఆహార శైలి, కాలుష్యం, పెరిగిన పొగాకు ఉత్పత్తుల వినియోగం కారణాలుగా పేర్కొనవచ్చు. కేన్సర్ కు నేటి వరకూ పరిమితంగా చికిత్స అందుబాటులో ఉంది. తొలిదశలో గుర్తిస్తేనే కేన్సర్ ను నయం చేయడం సాధ్యం. లేకుంటే ఆ వ్యాధికి తలవొంచక తప్పదు. ముందస్తు పరీక్షల ద్వారానే కేన్సర్ ను గుర్తించి నివారించడానికి వీలు కలుగుతుంది. 

ఆరోగ్య పరీక్ష - 6
ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం కేన్సర్ కేసులలో బ్రెస్ట్ కేన్సర్ కేసులు సుమారుగా 23 శాతం ఉంటున్నాయని 2008 గణాంకాలు చెబుతున్నాయి. దీని కారణంగా 2008లో ప్రపంచవ్యాప్తంగా 4,58,503 మంది మరణించారు. అంటే ఇది ఏ విధంగా ప్రబలుతుందో అర్థం చేసుకోవచ్చు. 
అందుకే యుక్త వయసు నుంచి 50 ఏళ్ల వరకూ ప్రతీ మహిళ రెండేళ్లకోసారి వైద్యుల వద్దకు వెళ్లి బ్రెస్ట్ కేన్సర్ పరీక్ష చేయించుకోవాలని చెబుతారు. దీనికి తోడు వారానికోసారి మహిళలు తమకు తామే వక్షోజాలను చేతులతో పరీక్షించుకుంటూ, గడ్డలు లాంటివేమైనా ఏర్పడినట్టు గుర్తిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లాలి. కేవలం నివారణే కేన్సర్ ను దూరంగా ఉంచగలదు. 

  • Loading...

More Telugu News