: మరోసారి దాడులకు తెగబడ్డ పాక్
పాకిస్థాన్ దుశ్చర్యలకు తెగబడుతూనే ఉంది. అమెరికా పర్యటన సందర్భంగా భారత్, పాకిస్థాన్ ప్రధానుల మధ్య చర్చలు జరిగి కొద్దిరోజులు కూడా గడవకముందే.. పాక్ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడింది. జమ్మూకాశ్మీర్ లోని పూంచ్ సెక్టార్లో సరిహద్దు నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి పాక్ సైన్యం తేలికపాటి ఆయుధాలతో దాడులకు దిగింది. తక్షణం స్పందించిన భారత సేనలు ఎదురుదాడి ప్రారంభించడంతో పాక్ దళాలు తోకముడిచాయి. ఈ దాడుల్లో ప్రాణనష్టం ఏమీ జరగలేదని కెప్టెన్ ఎస్ఎన్ ఆచార్య తెలిపారు.