: మెట్రో రైలు నమూనా బోగీని ప్రారంభించిన సీఎం
హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో మెట్రో రైలు నమూనా బోగీని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. రేపటినుంచి దీన్ని ప్రజల సందర్శనం కోసం అందుబాటులో ఉంచనున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పీవీ ఎక్స్ ప్రెస్ వే, ఔటర్ రింగ్ రోడ్డు మాదిరిగా మెట్రో రైలు నగరానికి మణిహారం కానుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దానం నాగేందర్, ముఖేశ్ గౌడ్ పాల్గొన్నారు.