: హైదరాబాదు చేరుకున్న జగన్
వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఈ ఉదయం హైదరాబాదు చేరుకున్నారు. కోర్టు అనుమతితో ఇడుపులపాయ వెళ్ళి తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళులర్పించిన జగన్ నిన్న రాత్రి అక్కడి నుంచి బయల్దేరారు. ఆయన వెంట తల్లి విజయమ్మ, అర్థాంగి భారతి కూడా ఉన్నారు. కాగా, హైదరాబాదు చేరుకున్న జగన్ కు రైల్వే స్టేషన్లో కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అంతకుముందు, ఇడుపులపాయలోనూ జగన్ ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.