: నేటినుంచి రాష్ట్రపతి విదేశీ పర్యటన
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆరు రోజుల పాటు బెల్జియం, టర్కీ దేశాల్లో ఆయన పర్యటిస్తారు. తమ దేశాన్ని సందర్శించాలన్న బెల్జియం రాజు ఆహ్వానం మేరకు నేటినుంచి ఐదవ తేదీ వరకు రాష్ట్రపతి పర్యటన ఉంటుంది. దాంతో, ఆ దేశాన్ని సందర్శించే మొదటి రాష్ట్రపతి ఆయనే కావడం విశేషం. ఈ సందర్భంగా 'యూరోపలియా-ఇండియా 2013-14'ను రాజు ఫిలిప్, ప్రణబ్ ప్రారంభించనున్నారు. అనంతరం ఈ నెల ఐదు నుంచి ఏడు వరకు టర్కీ సందర్శిస్తారు.