: అల్ ఖైదా ట్విట్టర్ ఖాతా నిలిపివేత


ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా ట్విట్టర్ ఖాతా నిలిచిపోయింది. సెప్టెంబర్ 24న ఆన్ లైన్ లో కనిపించిన ఆ ఖాతాకు 1500 మంది ఫాలోవర్లు ఉన్నారని న్యూయార్క్ డైలీ పేర్కొంది. అల్ ఖైదా ఆన్ లైన్ ఫోరానికి ఈ ఖాతా అనుబంధంగా ఉంది. ఖాతా నిలిపివేసే సమయానికి దానినుంచి 47 ట్వీట్ లు చేశారని.. అయితే, ఖాతా నిలిపివేతకు గల కారణాలను ట్విట్టర్ సంస్థ వెల్లడించలేదని తెలిపింది.

  • Loading...

More Telugu News