: నేడు ఒకే వేదికను పంచుకోనున్న మోడీ, చంద్రబాబు


భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఒకే వేదికను పంచుకోనున్నారు. ఈ రోజు పలు జాతీయ అంశాలపై ఢిల్లీలోని త్యాగరాజు స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరిగే 'సిటిజెన్స్ ఆఫ్ ఎకౌంట బుల్ గవర్నెన్స్' సదస్సులో వీరిద్దరూ పాల్గొంటారు. ఈ సదస్సులో చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేస్తారని, నరేంద్ర మోడీ సదస్సును ముగిస్తూ ఉపన్యసిస్తారని నిర్వాహకులు తెలిపారు. ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా పలు విద్యాసంస్థల నుంచి 7500 మంది విద్యార్ధులు హాజరుకానున్నారు.

  • Loading...

More Telugu News