: శ్రామిక సంక్షేమం మనదేశంలో తక్కువేనట!
భారతదేశం కొన్ని విషయాల్లో ముందడుగు వేసినా మరికొన్ని విషయాల్లో వెనుకబడే ఉందట. మనదేశంలో శ్రామిక శక్తి, ఉద్యోగిత విషయంలో మెరుగుదల కనిపించినా శ్రామిక సంక్షేమం విషయంలో మాత్రం వెనుకబడి ఉందట. అలాగే ప్రపంచ మానవ మూలధన సూచీలో భారతదేశం 78వ స్థానంలో నిలిచింది. జెనీవాకు చెందిన ప్రపంచ ఆర్ధిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) ప్రపంచంలోని 122 దేశాలకు చెందిన మానవ మూలధన సూచీ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో భారతదేశం 78వ స్థానంలో నిలిచింది.
ఈ జాబితాలో అత్యధిక మానవ మూలధన సూచీతో స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో నిలిచింది. భారతదేశంతోబాటు బ్రిక్స్ దేశాలైన చైనా 43వ స్థానంలోను, రష్యా 51వ స్థానంలోను, బ్రెజిల్ 57వ స్థానంలో ఉండగా దక్షిణాఫ్రికా భారత్‌కన్నా దిగువగా 86వ స్థానంలో నిలిచింది. ఇక కార్మికుల విషయంలో భారత్ శ్రామిక శక్తి, ఉద్యోగిత వంటి వాటిలో మెరుగైన స్కోరును సాధించగా, కార్మికుల ఆరోగ్యం, సంక్షేమం వంటి వాటిలో మాత్రం వెనుకబడి ఉందని డబ్ల్యూఈఎఫ్ పేర్కొంది.