: రాజ్ థాకరేకు బాడీ వారెంట్ జారీ చేసిన బీహార్ కోర్టు
మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన అధినేత రాజ్ థాకరేకు బీహార్ కోర్టు బాడీ వారెంట్ జారీ చేసింది. నవంబర్ 12వ తేదీలోపు తమ ఎదుట హాజరు పరచాలని కోర్టు ఈ వారెంట్ జారీ చేసింది. బీహారీలు రేపిస్టులంటూ థాకరే చేసిన వ్యాఖ్యలపై నమోదయిన కేసులో కోర్టు ఈ విధంగా స్పదించింది. థాకరేను హాజరుపరచాలని ముంబయి పోలిస్ కమిషనర్ ను కూడా కోర్టు ఆదేశించింది. థాకరే జూన్ 28న స్వయంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించగా ఆయన హాజరు కాకపోవడంతో బాడీ వారెంట్ జారీ చేసింది.