: జాతిపిత బోధనలు ఆకళింపు చేసుకోవాలి : ప్రణబ్ ముఖర్జీ
జాతిపిత మహాత్మాగాంధీ బోధనలు ఆకళింపు చేసుకుని అనుసరించడం ద్వారా వాటికి అమరత్వం చేకూరుతుందని బుధవారం గాంధీ జయంతి సందర్భంగా దేశప్రజలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. 'అహింస' అనే ఆయుధంతో సత్యాగ్రహం చేపట్టిన జాతిపిత ఆశయాలకు మనమందరం పునరంకితం కావడానికి ఆయన జయంతి చక్కటి సందర్భం అని పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలో అట్టడుగువర్గాల వారికి కల్పించిన హక్కులు గాంధీజీ విలువల నుంచి స్ఫూర్తి పొందినవేనని ఆయన అన్నారు.