: సెప్టెంబరులో 11.7 శాతం పెరిగిన మారుతి అమ్మకాలు
దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ సెప్టెంబర్ అమ్మకాలు 11.7 శాతం పెరిగాయి. పోయినేడాది ఇదే నెలతో పోలిస్తే ఈ సెప్టెంబరు మొత్తం అమ్మకాలు 1,04,964 యూనిట్లని కంపెనీ వెల్లడించింది. పోయినేడాది ఇదే నెలలో మొత్తం అమ్మకాలు 93,988 యూనిట్లు మాత్రమే.
చిన్న కార్లైన మారుతి 800, ఆల్టో, ఏ స్టార్, వాగన్ ఆర్ మోడళ్లు 4.9 శాతం పెరిగాయి. కాంపాక్ట్ సెగ్మంట్ కార్లైన స్విఫ్ట్, ఎస్టిలో, రిట్జ్ అమ్మకాలు 16.9 శాతం పెరిగాయి. సెడాన్ మోడల్ కారు డిజైర్ అమ్మకాలు మాత్రం ఆకాశాన్ని తాకాయి. సెప్టెంబరులో డిజైర్ అమ్మకాలు ఏకంగా 42.9 శాతం పెరిగాయి. అలాగే, ఎస్ ఎక్స్ 4 అమ్మకాలు 31.3 శాతం పెరిగాయి.