: జగన్ కూ లాలూ గతే పడుతుంది: యనమల


లాలూకు పట్టినగతే జగన్ కు కూడా పడుతుందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, దాణా కుంభకోణంలో 950 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన లాలూ ప్రసాద్ యాదవ్ ఎలా దోషిగా తేలారో.. లక్ష కోట్ల రూపాయల ఆర్థిక కుంభకోణానికి పాల్పడిన జగన్ కూడా అలానే దోషిగా తేలతాడని అన్నారు. 16 నెలలుగా జైలులోనే ఉన్నానంటూ సానుభూతి కోసం ప్రాకులాడుతున్న జగన్.. ఇలాంటి అవినీతి కేసులోనే 43 నెలలుగా జైల్లో ఉన్న మధు కోడా గురించి ఏమి చెబుతారో..? అని ఎద్దేవా చేశారు.

రాష్ట్ర విభజనకు సహకరిస్తానని ఒప్పందం కుదుర్చుకున్న జగన్ అసెంబ్లీ అత్యవసర ఏర్పాటు ద్వారా విభజనకు సహకరించాలని చూస్తున్నారని అన్నారు. వేల కోట్ల అవినీతికి పాల్పడిన జగన్ నీతులు వల్లించడం వింతగా ఉందన్నారు. సీపీఎం, ఎంఐఎం పార్టీలతో వైఎస్సార్సీపీని ఎలా పోల్చుతారని నిలదీశారు. అసలు జగన్ కు గవర్నర్ అపాయింట్ మెంటు ఇవ్వడమే తప్పని యనమల అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News