: రాగల 24 గంటల్లో పలుచోట్ల వర్షాలు
రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఒడిశా తీరాన్ని ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో పాటు ఇదే ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతుండటంతో రాష్ట్రంలో పలుచోట్ల వానలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వీటి ప్రభావం వల్ల ఉత్తర కోస్తా, తెలంగాణ జిల్లాల్లో పలుచోట్ల... దక్షిణ కోస్తా, రాయలసీమలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. ఒకటి రెండు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వివరించారు.