: కేసీఆర్ కు కోపం వచ్చింది!


టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు సీరియస్ అయ్యారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణను అడ్డుకునే వారెవరైనా తెలంగాణ ద్రోహులే అని వ్యాఖ్యానించారు. తమ మౌనాన్ని సీమాంధ్ర నేతలు అలుసుగా తీసుకుంటున్నారని ఆరోపించారు. మరో రెండు నెలల్లో తెలంగాణ వస్తుందనే మౌనంగా ఉంటున్నామని చెప్పుకొచ్చారు. ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తీరు చూస్తుంటే వీధి కొట్లాటకు సై అంటున్నట్లుగా ఉందని అభిప్రాయపడ్డారు. టీడీపీ ఎంపీలు పార్లమెంటులో ఉచ్చరించడానికి వీల్లేని భాషలో మాట్లాడుతున్నారని విమర్శించారు.

ఇక వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మపైనా కేసీఆర్ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. పరకాలలో చిలుకపలుకులు పలికిన విజయమ్మ హైదరాబాదును పాకిస్థాన్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. షర్మిల కూడా అలాగే మాట్లాడిందని ఆరోపించారు. హైదరాబాదును పాకిస్థాన్ తో పోల్చిన వైఎస్సార్సీపీ నేతలు ఇక్కడ భారీ బహిరంగ సభ ఎలా పెడతారని కేసీఆర్ ప్రశ్నించారు. ఓయూ విద్యార్థులను తాలిబాన్లతో పోల్చడం ఏం సంస్కారం? అని దుయ్యబట్టారు. ఇక సీమాంధ్రలో తన బొమ్మలను, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ బొమ్మలను నీచంగా చిత్రీకరించడాన్ని ఖండించారు.

  • Loading...

More Telugu News