: ఆర్డినెన్స్ ను రేపు ఉపసంహరించుకోనున్న ప్రధాని?


కళంకిత నేతలను చట్టసభకు పంపే వెసులుబాటు కల్పించే ఆర్డినెన్స్ ను.. ప్రధాన మంత్రి రేపు ఉపసంహరించుకుంటారనే వార్తలు ఢిల్లీలో షికార్లు చేస్తున్నాయి. రేపు జరగనున్న కేంద్ర కేబినెట్ సమావేశంలో దీనికి సంబంధించిన నిర్ణయాన్ని ప్రధాని తీసుకోబోతున్నారని సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ యువరాజు రాహుల్ ఈ ఆర్డినెన్స్ ను చించిపారేయండని ఘాటుగా మాట్లాడిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్ ను వెనక్కు తీసుకోవడం మినహా పీఎంకు మరో గత్యంతరం లేదని విశ్లేషకుల అంచనా. ప్రధాని మన్మోహన్ ఈ రోజు సాయంత్రం అమెరికా నుంచి తిరిగి వస్తున్నారు. ఆయన రేపు ఉదయం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. అనంతరం, రేపు సాయంత్రం 6 గంటలకు జరిగే కేబినెట్ సమావేశానికి హాజరవుతారు.

  • Loading...

More Telugu News