: అరసవల్లి సూర్యనారాయణుడి భక్తులకు నిరాశ
శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో వెలసిన సూర్యనారాయణుడిని తొలి రోజు భానుడి కిరణాలు తాకలేదు. ప్రతి యేడాది అక్టోబరు మొదటి వారంలో మూడు రోజులపాటు సూర్య కిరణాలు ఆదిత్యుని స్పృశిస్తాయి. పది నిమిషాల పాటు భానుడి కిరణాలు స్వామి వారిని శిరస్సు నుంచి పాదాల వరకు తాకుతాయి. అయితే ఇక్కడి వాతావరణం మేఘావృతమై ఉండటంతో భానుడి కిరణాలు మూలవిరాట్టును తాకలేదు. దీంతో, ఈ అద్భుత సన్నివేశాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు నిరాశతో వెనుదిరిగారు. రానున్న రెండు రోజుల్లో అయినా తమకు ఆ విశేష భాగ్యం కలగాలని ప్రార్థించారు. ఇకపోతే ఈ అద్భుత దృశ్యాన్ని చూడడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తుంటారు.