: ఆర్టీసీ పుష్పక్ చార్జీల పెంపు


హైదారాబాదులోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే 'పుష్పక్ ఎయిర్ పోర్ట్ లైనర్' బస్సుల చార్జీలు పెరిగాయి. పెరిగిన చార్జీలు ఈ రోజు నుంచే అమల్లోకి రానున్నాయి. పుష్పక్ చార్జీలలో ఇప్పటిదాకా మూడు శ్లాబులు ఉండేవి. ఇప్పడు వీటిని రెండు శ్లాబులకు కుదించారు. పెరిగిన చార్జీల నేపథ్యంలో 34 కి.మీ. లోపు ప్రయాణించే వారు రూ. 200 చొప్పున, 34 కి.మీ. కంటే ఎక్కువ దూరం ప్రయాణించేవారు రూ. 250 చొప్పున చెల్లించాలి. గతంలో ఉన్న రూ. 150 చార్జి రూ. 200 కు పెరిగింది. అలాగే, రూ. 200 చార్జి రూ. 250 కి పెరిగింది.

  • Loading...

More Telugu News