: అక్రోట్‌తో గుండెజబ్బులకు చెక్ పెట్టవచ్చు!
మీరు అధిక బరువు కారణంగా గుండెకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వస్తాయని భయపడుతున్నారా... అయితే మీ సమస్యలకు ఒక చక్కటి పరిష్కారం ఉంది. గుండె జబ్బులకు సంబంధించిన ఒక చక్కటి పరిష్కారం ఏమంటే అక్రోట్ పప్పులు.
అక్రోట్ పప్పు తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంతోబాటు మధుమేహ వ్యాధిని కూడా అదుపులో ఉంచవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శాస్త్రవేత్తలు కొందరు అధిక బరువుకల వారిపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాన్ని గుర్తించారు. సుమారు 46 మందిని ఎంపిక చేసుకుని వారిని రెండు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూపువారికి వారి రోజువారీ ఆహారంతోబాటు అక్రోట్ పప్పును ఇచ్చారు. రెండో గ్రూపువారికి ఇవ్వలేదు. ఎనిమిది వారాల తర్వాత పరిశీలిస్తే వారిలో అక్రోట్ పప్పును ఆహారంతోబాటు తీసుకున్నవారికి గుండె జబ్బులు వచ్చే సమస్య చాలా వరకు తగ్గినట్టు తేలింది. అంతేకాదు అక్రోట్ పప్పును రోజూ ఆహారంతోబాటు తీసుకోవడం వల్ల ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని కూడ తగ్గించవచ్చని బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ వారు చెబుతున్నారు.