: చిన్నదైతేనేం... శక్తి ఎక్కువేనట!


చూడడానికి చిన్న రూపంతో కనిపిస్తుంది... ఎంత చిన్నదంటే ధాన్యపు గింజ పరిమాణంకన్నా కూడా చిన్నది. అంత చిన్నరూపంలో ఉండే పార్టికల్‌ యాక్సిలరేటర్‌ని శాస్త్రవేత్తలు తయారుచేశారు. ఈ యాక్సిలరేటర్‌ చూడడానికి చిన్నదిగా ఉన్నా కూడా భారీ యాక్సిలరేటర్‌కన్నా ఎక్కువ శక్తిమంతమైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

భారీ పరిమాణంలో ఉండే పదార్ధ యాక్సిలరేటర్‌ను ధాన్యపు గింజకన్నా కూడా తక్కువ పరిమాణంలో ఉండేలా అమెరికా శాస్త్రవేత్తలు రూపొందించారు. దీన్ని ఒక ఎలక్ట్రానిక్‌ చిప్‌పై అమర్చేంత చిన్నదిగా ఉన్నా కూడా దీని శక్తి అమోఘమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ యాక్సిలరేటర్‌పై పలు ప్రయోగాత్మక పరీక్షలు నిర్వహించారు. ఇది అమెరికా ఇంధన శాఖకు సంబంధించిన భారీ ఎస్‌ఎల్‌ఏసీ లీనియర్‌ యాక్సిలరేటర్‌కన్నా కూడా పదిరెట్ల ఎక్కువ వేగంతో ఎలక్ట్రాన్లను కదిలించింది. ఈ పరిజ్ఞానాన్ని ఆచరణలోకి తీసుకురావడానికి ఇంకా పలు అడ్డంకులున్నాయని జోయెల్‌ ఇంగ్లండ్‌ అనే శాస్త్రవేత్త చెబుతున్నారు. ఇది వినియోగంలోకి వస్తే ప్రాథమిక పదార్ధాల అన్వేషణకు ఉద్దేశించిన హై ఎనర్జీ పార్టికల్‌ కొలైడర్ల పరిమాణం, ధర తగ్గుతాయని చెబుతున్నారు. అంతేకాకుండా భద్రతాపరమైన స్కానింగ్‌, వైద్య చికిత్స, ఇమేజింగ్‌, జీవశాస్త్ర పరిశోధన, పదార్ధశాస్త్రంలో ఉపయోగించేందుకు బుల్లి యాక్సిలరేటర్లు, ఎక్స్‌రేలకు ఇది వీలు కల్పిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News