: కిరణ్ రాజీనామా సంగతి హైకమాండ్ చూసుకుంటుంది: సందీప్ దీక్షిత్


సమైక్యాంధ్రకు మద్దతుగా పదవికి రాజీనామా చేయడమనేది సీఎం కిరణ్ ఇష్టమని, ఆ వ్యవహారాన్ని హైకమాండ్ చూసుకుంటుందని ఏఐసీసీ అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్ వ్యాఖ్యానించారు. తాము సీడబ్ల్యూసీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని, దానిపై వెనకడుగువేసే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో నేడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆంటోనీ కమిటీ పలు అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణ జరిపి, ఆ వివరాలను కేబినెట్ కు అందజేస్తుందని, వాటిని బిల్లులో పొందుపరుస్తారని దీక్షిత్ వివరించారు. కాగా, సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల రాజీనామాలను స్పీకర్ మీరాకుమార్ ఇంకా ఆమోదించలేదని తెలిపారు.

  • Loading...

More Telugu News