: నరకానికి ద్వారం ఆ గ్రామంలో!


పాపాలు చేస్తే, చనిపోయిన తర్వాత నరకానికి పోతారని చెబుతుంటారు. అలా అంటుంటే వినడమే కానీ, అసలు నరకం ఉంటుందా? ఉంటే ఎక్కడ? అనే విషయాలు ఎవరికీ తెలియవు. కానీ, తుర్కుమెనిస్థాన్ దేశంలో, కరకుమ్ ఏడారిలో డెర్వేర్ అనే గ్రామానికి వెళితే.. ఆ గ్రామ ప్రజలు నరకానికి దారి చూపిస్తారు. 

ఈ గ్రామంలోని భూ గర్భంలో అపార గ్యాసు నిల్వలున్నాయి. వాటి వెలికితీత కోసం 1971లో అక్కడ డ్రిల్లింగ్ చేస్తున్నారు. ఒక్కసారిగా డ్రిల్లింగ్ చేస్తున్న భాగం కుప్పకూలిపోయింది. భూమిలో 70 మీటర్ల వెడల్పుతో గుండ్రంగా పెద్ద తొర్ర ఏర్పడింది. గ్యాస్ ను పీలిస్తే విషపూరితమని భావించిన సోవియట్ జియాలజిస్ట్ వెంటనే అక్కడ మంట పెట్టాడు. 

ఒకటి రెండు రోజులలో గ్యాస్ మంటలు ఆరిపోతాయనుకున్నారు. కానీ లేదు. అలా 42 సంవత్సరాలు దాటినప్పటికీ నేటికీ అక్కడ గ్యాస్ మంటలు చల్లారలేదు. అందుకే డెర్వేర్ గ్రామస్థులు దానిని 'డోర్ ఆఫ్ హెల్' అని పిలుస్తారు. ఈ గ్రామస్థుల జనాభా కేవలం 350. తుర్కుమెనిస్థాన్ ప్రభుత్వం మొత్తానికి ఈ గ్రామ ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించింది. 

  • Loading...

More Telugu News