: మాపై అత్యాచారం జరిపారు: ముజఫర్ నగర్ బాధితులు


ముజఫర్ నగర్ అల్లర్లలో అరాచక శక్తుల దురాగతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అల్లర్ల ముసుగులో దోపిడీలు, గృహదహనాలు, దాడులే కాకుండా అత్యాచారాలకు కూడా పాల్పడ్డారు దుండగులు. ముజఫర్ నగర్ జిల్లా ఫుగనా గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలు అల్లర్ల సమయంలో తమపై సామూహిక అత్యాచారం జరిగిందని ఈ రోజు రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో 17 మందిపై పోలీసులు మూడు వేర్వేరు కేసులు నమోదు చేశారు. ముజఫర్ నగర్ అల్లర్లలో 49 మంది ప్రాణాలు కోల్పోగా, 40 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు.

  • Loading...

More Telugu News