: కదంతొక్కిన 13 జిల్లాల వైద్యులు
సమైక్యాంధ్రకు మద్దతుగా 13 జిల్లాల వైద్యులు కదంతొక్కారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రి వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర సదస్సు నిర్వహించారు. వివిధ వేషధారణలతో నిరసన తెలిపిన వైద్యులు సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. అనంతరం కొత్త ఆసుపత్రి నుంచి ర్యాలీగా బయలుదేరి ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతికి సమైక్యాంధ్ర మెమొరాండం ఇచ్చేందుకు ప్రయత్నించారు. దీన్ని పోలీసులు అడ్డుకోవడంతో వైద్యులు యూనివర్శిటీ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.