: యువీకి చోటు.. వీరూ,గౌతీలకు మొండిచేయి


ఆసీస్ తో ఏకైక టీ20తో పాటు ఏడు వన్డేల సిరీస్ లో తొలి మూడు వన్డేలకుగాను టీమిండియాను ప్రకటించారు. అనుకున్నట్టుగానే డాషింగ్ బ్యాట్స్ మన్ యువరాజ్ సింగ్ పునరాగమనం చేశాడు. ఇటీవల విండీస్-ఏ జట్టుపై రాణించిన యువీ పట్ల బీసీసీఐ సెలక్షన్ కమిటీ కరుణ చూపింది. ఈ మేరకు చెన్నైలో సమావేశమైన సీనియర్ సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. తెలుగుతేజం అంబటి రాయుడిపై సెలక్టర్లు మరోసారి నమ్మకముంచారు. ఇక సీనియర్ ఆటగాళ్లు సెహ్వాగ్, గంభీర్ లు పెద్దగా రాణించకపోవడంతో వారిని ఎంపిక సందర్భంగా పరిగణనలోకి తీసుకోలేదు. జింబాబ్వేతో సిరీస్ కు విశ్రాంతి తీసుకున్న ధోనీ, భువనేశ్వర్, ఇషాంత్ శర్మ, అశ్విన్ జట్టులోకొచ్చారు. కాగా, పుజారా, రసూల్, కార్తీక్, రహానే తమ స్థానాలు నిలుపుకోవడంలో విఫలమయ్యారు.

జట్టు వివరాలు వివరాలు.. ధోనీ (కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, రవీంద్ర జడేజా, అశ్విన్, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, వినయ్ కుమార్, అమిత్ మిశ్రా, అంబటి రాయుడు, మహ్మద్ సమీ, జయదేవ్ ఉనద్కత్.

  • Loading...

More Telugu News