: సెంచరీ కొట్టేవరకు ధోనీ కూడా ఎవరో తెలియదు: అశోక్ బాబు
మొదటి సెంచరీ కొట్టేవరకు ధోనీ కూడా ఎవరో తెలియదని, అశోక్ బాబు కూడా అంతేనని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన 'సకల జన భేరీ' సభలో కేసీఆర్ తనపై చేసిన విమర్శలపై కర్నూలులో 'సమైక్య రాష్ట్ర జన గర్జన సభ'లో మాట్లాడుతూ ఆయన ఈ విధంగా స్పందించారు. 'మీతో కలిసి ఉండాలని కోరుకుంటున్నాం కాబట్టే సహనంగా ఉన్నామని' ఆయన తెలిపారు. తమపై చెప్పులు వేస్తే ఊరుకునే సంస్కారం తమకుందని, ఆ సంస్కారం ఎదుటివారికుందా? అని ఆయన ప్రశ్నించారు. తాము రాజకీయాల్లోకి రాలేదని, సమైక్య రాష్ట్రం కోసమే ఉద్యమం చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. అందుకే ఉద్యమాన్ని శాంతియుతంగా నడుపుతున్నామన్నారు.