: ఉద్యోగులందరూ కోరుకునేది సమైక్య రాష్ట్రమే : సంపత్ కుమార్


ఉద్యోగులందరూ కోరుకునేది సమైక్య రాష్ట్రమేనని ఏపీఎన్జీవో నేత సంపత్ కుమార్ అన్నారు. ఆయన సమైక్య రాష్ట్ర ప్రజాగర్జన సభలో ప్రసంగించారు. సమైక్య ఉద్యమానికి ప్రత్యేకంగా నాయకులంటూ ఎవరూ లేరని... ఇక్కడున్న వారంతా నాయకులేనని అన్నారు. గత 60 రోజులుగా సమైక్య ఉద్యమం సాగుతోందని... అందరూ స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని తెలిపారు. ఇన్నాళ్లు కలిసి ఉండి ఇప్పుడు ఎందుకు విడిపోవాలని ఆయన ప్రశ్నించారు. తెలుగువారి భాష, భావం సమైక్యాంధ్రని వెల్లడించారు. రాష్ట్రం విడిపోతే ఇరు ప్రాంతాలకు నష్టమేనని సంపత్ కుమార్ తెలిపారు. సీమాంధ్ర ఉద్యోగులు జీతాలు కాకుండా జీవితాలు అడుగుతున్నారని అన్నారు.

  • Loading...

More Telugu News