: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నేటి నుంచి


భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈ ఉదయం ఢిల్లీలో ప్రారంభమవుతున్నాయి. రాజ్ నాథ్ సింగ్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక ఆయన ఆధ్వర్యంలో తొలిసారిగా ఈ సమావేశాలు జరగబోతున్నాయి. పార్టీ అగ్రనేతలు పాల్గొంటున్న ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చిస్తారు. ముఖ్యంగా ఈ సంవత్సరం 9 రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వ్యూహాలు ఖరారు చేయనున్నారు.

ఆ తర్వాత, 2014లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ శ్రేణులను సమాయత్తం చేసే వైపుగా చర్చలు కొనసాగుతాయి. ఇవన్నీఒక ఎత్తైతే.. అధికార యూపీఏ పాలనలో జరుగుతున్న అవినీతి, ధరల పెంపు, దేశ అంతర్గత భద్రత, పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసే అంశాలపైనా నేతలు చర్చిస్తారు. కాగా రేపు, ఎల్లుండి జాతీయ కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తారు. 

  • Loading...

More Telugu News