: రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై రాహుల్ స్పందించాలి: మోదుగుల


రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించాలని నరసరావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి డిమాండ్ చేశారు. గుంటూరు నగరంలో తెలుగు యువత చేపట్టిన సమైక్యాంధ్ర ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. నేరచరితులపై కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను తప్పుపట్టిన రాహుల్, సీడబ్ల్యుసీ రాజకీయ ప్రయోజనాలకోసం రాష్ట్ర విభజనపై తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తారా? అని ప్రశ్నించారు. సమైక్యాంధ్ర కోసం అన్ని పార్టీలకు చెందిన సీమాంధ్ర ఎంపీలు కలిసి పనిచేయాలని, పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తమ వాణిని వినిపించాలని ఆయన పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News