: హైదరాబాద్ కమ్యూనిస్టుల సొత్తు : సీపీఐ నారాయణ
హైదరాబాద్ నగరం కేసీఆర్ దో, లగడపాటిదో కాదని, అది కమ్యూనిస్టుల సొత్తని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. దోపిడీదారులు, అవినీతిపరులు సమైక్యాంధ్ర ముసుగులో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ సాధనలో అనుకూల శత్రువులు ఎక్కువగా ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో యుద్ధం ప్రకటించారని, అది ఢిల్లీలో చేస్తే బాగుంటుందని ఆయన అన్నారు.