: డీజీపీ దినేష్ రెడ్డి పిటిషన్ పై ముగిసిన వాదనలు
తన పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ డీజీపీ దినేష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై... హైకోర్టు న్యాయమూర్తి నివాసంలో వాదనలు ముగిశాయి. దీనికి సంబంధించిన తీర్పును న్యాయమూర్తి ఈ రోజు సాయంత్రం కానీ, రేపు ఉదయం కానీ వెలువరించే అవకాశం ఉంది. పదవీకాలాన్ని పొడిగించలేమన్న క్యాట్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ డీజీపీ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.