: సీనియర్లను కాదని నిర్ణయం తీసుకుంటే పార్టీ కూలిపోతుంది : రాయపాటి
సీనియర్ల మనోభావాలకు అనుగుణంగా పార్టీ నిర్ణయాలు తీసుకోవాలని సీమాంధ్ర ఎంపీ రాయపాటి సాంబశివరావు తెలిపారు. లేకపోతే పార్టీ కుప్పకూలుతుందని హెచ్చరించారు. ఇప్పటికిప్పుడు రాష్ట్ర విభజన ప్రక్రియను ఆపేస్తే 25 సీట్లను గెలిపించి హైకమాండ్ కు ఇస్తామని అన్నారు. కాబట్టి హైకమాండ్ తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరారు. నిన్న ఢిల్లీకి లేటుగా వచ్చింనందువల్లే స్పీకర్ మీరా కుమార్ ను కలవలేకపోయానని రాయపాటి తెలిపారు. తాము సీమాంధ్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగానే మాట్లాడుతున్నామని అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ చెప్పిన విషయాలలో నిజాలున్నాయని... వాటితో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని అన్నారు. తమని రాజీనామా చేయొద్దని కోరుతున్న బొత్స... తాను మాత్రం రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నారని తెలిపారు. టీఆర్ఎస్ ను ఎట్టి పరిస్థితుల్లో నమ్మరాదని హితవు పలికారు.