: డిప్రెషన్‌కు మందేస్తే.. స్మోకింగ్‌కు చెక్!!
ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టు .... ఒక రుగ్మత నయం కావడానికి మందు ఇస్తే, మరో రుగ్మత కొలిక్కి వస్తోంది. విషయం ఏంటంటే.. డిప్రెషన్‌తో బాధపడుతున్న వారికి ఎమోషన్స్ కంట్రోల్ కావడానికి మందు ఇచ్చినట్లయితే.. వారిలో స్మోకింగ్ అలవాటు కూడా తగ్గుతుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
ఎలాగంటే.. డిప్రెషన్లో ఉన్నవారు. మామూలు వారికంటె రెట్టింపుగా సిగరెట్లు తాగేస్తుంటారట. వీరికి ఎమోషన్స్ కంట్రోల్ చేసే చికిత్స బెటరని డచ్ ఎక్స్పర్ట్ సెంటర్ ఆన్ టుబాకో కంట్రోల్ పరిశోధకులు నిర్ణయించారు. వీరు డిప్రెషన్లో ఉండి స్మోక్ చేసే కొందరిని సైకోసోషల్ ఎమోషనల్ ట్రీట్మెంట్ తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు రెగినా వాన్ డెర్మీర్ నేతృత్వంలోని బృందం 49 మంది మీద పరిశోధన సాగించింది. ఇందులో 33 పరిశోధనలు కేవలం స్మోకింగ్ మాన్పించడానికే కావడం విశేషం. వీరికి కౌన్సెలింగ్, వ్యాయామంతో పాటూ బుప్రోపియాన్ మందు ఇస్తూ వచ్చారు. దీంతో స్మోకర్లు చాలా కాలం స్మోకింగ్ మానేస్తున్నట్లు గ్రహించారు. మొత్తానికి డిప్రెషన్‌కు మాత్రమే కాదు.. స్మోకింగ్‌కు కూడా కలిపి ఉమ్మడి మందు తయారైందన్నమాట.