: సంగీతకారులకు ఒత్తిడి తక్కువేనట!


ఒకటికన్నా ఎక్కువ సంగీత పరికరాలను వాయించగలిగే నేర్పుగలిగిన వ్యక్తులు డిప్రెషన్‌కు గురయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయట. సంగీతం తెలిసిన వారు మిగిలిన వారితో పోల్చుకుంటే తమ చురుకైన మెదడుతో తమ తప్పులను చాలా తొందరగా గుర్తించగలుగుతారట. సెయింట్‌ ఆండ్రూస్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

ఈ అధ్యయనం సందర్భంగా శాస్త్రవేత్తలు సంగీత ప్రియులైన వ్యక్తులకు, పెద్దగా సంగీత పరిజ్ఞానం లేనివారు చిన్న చిన్న తప్పులను చేసే సమయంలో వారి ప్రవర్తన, పలు విషయాల్లో మెదడు స్పందించే విధానాన్ని పరిశీలించారు. ఒక సంగీత పరికరాన్ని తగు స్థాయిలో వినడం వల్ల అది వ్యక్తి యొక్క సామర్ధ్యంపై చక్కగా పనిచేసి తాను చేసిన తప్పులను సవరించుకునే విధంగా చేస్తుందని ఈ పరిశోధనలో తేలింది. ఇలా మితమైన స్థాయిలో సంగీతాన్ని ఆస్వాదించడం మెదడు పనితీరుపై కూడా చక్కటి ప్రభావాన్ని చూపిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News