: ముఖ్యమంత్రి తీరు ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసేలా ఉంది: ఈటెల
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడిన తీరు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థనే అవహేళన చేసే విధంగా ఉందని టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో హైదరాబాద్ సిర్ఫ్ హమారా పేరుతో జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. న్యాయస్థానాలు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంస్థల మీద సీఎంకు విశ్వాసం ఉన్నట్టు కనిపించడం లేదని ఆయన విమర్శించారు. దేశంలో నదీ జలాల వివాదాలు పరిష్కరించడానికి చట్టాలు ఉన్నాయని, ఎక్కడా జలయుద్ధాలు జరగలేదని ఆయన అన్నారు.