: పాలమూరు సభలో కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన కిషన్ రెడ్డి


'తెలంగాణ ప్రజా గర్జన' పేరుతో మహబూబ్ నగర్ జిల్లా పాలమూరులో జరుగుతున్న సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కాంగ్రెస్ పై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. దేశాన్ని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది కాంగ్రెస్సేనని మండిపడ్డారు. యూపీఏ పాలనంతా అవినీతిమయమని ఆరోపించారు. అయితే, చిన్న రాష్ట్రాల ద్వారానే అభివృద్ధి సాధ్యమని పునరుద్ఘాటించారు. రాష్ట్ర విభజనకు బీజేపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కానీ, స్వార్ధ రాజకీయాల కోసం ప్రజలను కొందరు రెచ్చగొడుతున్నారన్న కిషన్ రెడ్డి.. సీమాంధ్రలో నాయకత్వం కోసమే సమైక్యాంధ్ర ఉద్యమం సాగుతోందని ఆరోపించారు. విభజన జరిగితే రాజధాని వస్తుందని, విద్య, వైద్య సౌకర్యాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో కేంద్రంతోపాటు, రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసిన ఆయన.. గుజరాత్ మాదిరిగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News