: పాక్ వైద్యుడు ఇప్పుడు అమెరికా 'హీరో'!


ఓ పాకిస్తానీ వైద్యుడు ఇప్పుడు అమెరికన్ల దృష్టిలో హీరోగా కీర్తినార్జిస్తున్నాడు. ఆయన పేరు డాక్టర్ షకీల్ అఫ్రిది! అమెరికా బద్దశత్రువు బిన్ లాడెన్ ను మట్టుబెట్టడంలో అమెరికాకు అఫ్రిది అందించిన సహాయం అంతా ఇంతా కాదు మరి! పాకిస్తాన్ లో లాడెన్ ఆనుపానులు పసిగట్టి, ఆ సమాచారాన్ని అమెరికా దళాలకు అందించింది ఈయనే. ఆ సమాచారంతోనే అమెరికా దళాలు లాడెన్ ను అంతమొందించాయి.

అయితే, లాడెన్ మరణించిన మూడు వారాలకు అఫ్రిదీని పాక్ ప్రభుత్వం జైల్లో పెట్టింది. అఫ్రిది, ఆయన కుటుంబం పాక్ చేతిలో చిత్ర హింసలకు గురవుతోందనీ, ఆయనను వెంటనే విడుదల చేయాలనీ అమెరికా సెనేటర్లు డిమాండు చేస్తున్నారు. ఆయనను అమెరికా హీరోగా గుర్తించాలనీ, ఆయనను జైలు నుంచి విడుదల చేయించే బాధ్యతను అమెరికా తీసుకోవాలనీ కోరుతూ అమెరికా ప్రతినిధుల సభలో ఓ తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు.        

  • Loading...

More Telugu News