: పెరగనున్న మహీంద్రా కార్ల ధరలు
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా కార్లతో పాటు కమర్షియల్ వాహనాల ధరలను పెంచనుంది. ఈ పెరుగుదల రూ. 6 వేల నుంచి రూ. 20 వేల వరకు ఉండబోతోంది. కొత్త ధరలు అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని మహీంద్రా తెలిపింది. డాలర్ తో రూపాయి మారకం విలువ పడిపోవడం, విడిభాగాల ధరలు పెరగడం లాంటి కారణాల వల్ల ధరలు పెంచక తప్పడం లేదని వివరించింది. గత కొంత కాలంగా తాము ధరలు పెంచలేదని... ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో పెంచాల్సి వస్తోందని తెలిపింది.