: డీజీపీ పోస్టు శాస్త్రవేత్తను వరించనుందా?


రాష్ట్ర డీజీపీగా ఈ నెలాఖరున రిటైర్ కాబోతున్న దినేష్ రెడ్డి స్థానంలో... కొత్త బాస్ గా ఎవరు వస్తారనే విషయంలో ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ రేస్ లో 1979 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ బి.ప్రసాద్ రావుకే ఎక్కువ అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం ఏసీబీ డైరక్టర్ జనరల్ గా వ్యవహరిస్తున్నారు. ఈయన గతంలో హైదరాబాద్ కమిషనర్ గా పనిచేశారు. ఈయనలో మరో కోణం కూడా దాగుందండోయ్. ఈయన ఖాకీ దుస్తుల్లో ఉన్న కరుడుగట్టిన పోలీస్ అధికారే కాదు... ఒక శాస్త్రవేత్త కూడా. ఆయన తన ఇంట్లో ఏర్పాటుచేసుకున్న ల్యాబొరేటరీలో రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు.

ఈయనతో పాటు 1977 బ్యాచ్ కు చెందిన ఉమేష్ కుమార్ కూడా డీజీపీ పోస్టుకు పోటీపడుతున్నారు. అయితే ఈయన ఫోర్జరీ కేసును ఎదుర్కొంటుండటంతో... ఈయనకున్న అవకాశాలు అంతంత మాత్రమేనని చెప్పొచ్చు. ఇంకా ఈ రేసులో 1979 బ్యాచ్ కి చెందిన టీ.పీ.దాస్, ఎస్.ఏ.హుడా, అరుణా బహుగుణ.... 1981 బ్యాచ్ కు చెందిన కే.దుర్గా ప్రసాద్, ఏ.కే.ఖాన్ ఉన్నారు. వీరిలో బహుగుణ ప్రస్తుతం డిప్యూటేషన్ పై ఢిల్లీలో ఉన్నారు. ఈమె డీజీపీగా ఎంపికైతే... మన రాష్ట్రంలో డీజీపీగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళగా చరిత్రకెక్కుతారు. హుడా శాంతి భద్రతల డీజీగా పనిచేస్తున్నారు. ప్రసాద్ రావుకి బహుగుణ, హుడాల నుంచే ఎక్కువ పోటీ ఉండే అవకాశం ఉంది. 'యూపీఎస్ సీ'కి పంపాల్సిన డీజీపీ అభ్యర్థుల లిస్ట్ సిద్ధంగా ఉన్నట్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వీటిలో అభ్యర్థులకు సంబంధించిన అన్ని వివరాలను పొందుపరచారని తెలిపారు. లేకపోతే ఇతర అభ్యర్థులు క్యాట్ తో పాటు కోర్టులను సంప్రదించే అవకాశం ఉందని తెలిపారు.

  • Loading...

More Telugu News