: యూపీఏ నిర్ణయాన్ని తప్పుబట్టాం: ఎంపీ అనంత


విభజన ప్రకటన వెలువడిన రోజునే తాము అధిష్ఠానం నిర్ణయాన్ని తప్పుబట్టామని ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, విభజన ఆపాలని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కేంద్రంలో ఉన్న నాయకులందరినీ కోరామని తెలిపారు. ఆ ప్రయత్నంలో భాగంగా పది రోజుల్లో వస్తుందన్న తెలంగాణ నోట్ ను 60 రోజులు అవుతున్నా రానీయకుండా ఆపామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు రాజీనామాలు చేస్తే ప్రక్రియ ఆగిపోతుందని ప్రజలు కోరడంతో వారి కోరిక మేరకు రాజీనామాలు చేశామని ఆయన తెలిపారు. స్పీకర్ ను వ్యక్తిగతంగా కలిసి రాజీనామా లేఖలు ఇచ్చామని, త్వరలోనే అవి ఆమోదం పొందుతాయని ఆయన నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News