: రాజకీయనేత కావాలని ఉంది: పాక్ బాలిక మలాలా
హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రకటించిన 'సివిల్ సొసైటీ-2013 అవార్డు'ను పదహారేళ్ల పాకిస్థాన్ సాహస బాలిక మలాలా యూసఫ్ జాయ్ స్వీకరించింది. న్యూయార్క్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మలాలా మాట్లాడుతూ.. రాజకీయ నేత కావాలని ఉందని తన మనసులో మాట తెలిపింది. ఎందుకంటే వారికి ఎక్కువగా పాప్యులారిటీ ఉంటుందని పేర్కొంది. పాకిస్థాన్ స్వాత్ వాలీలోని తన సొంతఊరిని తలుచుకున్న మలాలా.. ఏదో ఒకరోజు తిరిగి తన గ్రామానికి వెళతానని ఆశాభావం వ్యక్తం చేసింది. గత సంవత్సరం అక్టోబరులో మలాలాపై పాక్ లో తాలిబన్లు కాల్పులు జరపడంతో లండన్ లో చికిత్స తీసుకుని కోలుకుంది. అప్పటినుంచి కుటుంబంతో ఆక్కడే ఉంటోంది. ప్రస్తుతం మలాలా పేద బాలికలకు విద్య కోసం కృషిచేస్తూ.. నిధులు సమీకరిస్తోంది.