: పట్టువదలని డీజీపీ


డీజీపీ దినేశ్ రెడ్డి పదవిని వీడేందుకు ససేమిరా అంటున్నారు. పదవీకాలం పొడిగించుకునే క్రమంలో పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పదవీకాలాన్ని పొడిగించడం కుదరదని క్యాట్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తాజాగా హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. పదవీ విరమణతో సంబంధం లేకుండా డీజీపీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రెండేళ్ల పాటు సేవ చేయవచ్చని, ఆ మేరకు తన పదవీకాలన్ని మరో ఏడాది పాటు పొడిగించాలని పిటిషన్ లో కోరారు. మరో రెండు రోజుల్లో ఆయన పదవీకాలం ముగియనున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News