: కేంద్ర ప్రభుత్వ రంగ కార్మిక సంఘ నేతలతో అశోక్ బాబు భేటీ
విశాఖపట్నంలో ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు ఈ రోజు కేంద్ర ప్రభుత్వ రంగ కార్మిక సంఘ నేతలతో భేటీ అయ్యారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమ తీరుతెన్నులపై వారితో చర్చించారు. అంతేకాక, భవిష్యత్తులో ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న అంశంపై వారి సలహాలు తీసుకున్నారు. సీమాంధ్రలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడికి సంబంధించిన అంశం ఈ సమావేశంలో చర్చకువచ్చింది.