: 515కి చేరిన పాకిస్థాన్ భూకంప మృతుల సంఖ్య


పాకిస్థాన్ నైరుతి ప్రాంతాన్ని కుదిపేసిన భూకంపంలో మరణించిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. బెలూచిస్థాన్ ప్రాంతంలో సంభవించిన ఈ వైపరీత్యంలో మృతుల సంఖ్య 515కి చేరుకుంది. నిరాశ్రయులైన వారి సంఖ్య లక్షలకు చేరుకుందని అక్కడ పునరావాస కార్యక్రమాల్లో పాల్గొంటున్న అధికారులు తెలిపారు. వందల సంఖ్యలో ఇళ్లు, దుకాణాలు కూలిపోయాయి. శిథిలాలను తొలగించే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

  • Loading...

More Telugu News