: తిరుపతి లడ్డూలో ఇనుప ముక్క


భక్తులు ఎంతో పవిత్రంగా, ప్రీతి పాత్రంగా భావించే ఏడుకొండలవాడి లడ్డూలో ఇనుపముక్క కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది భక్తులను కలచివేసే ఈ దారుణ సంఘటన నిన్న తిరుమలలో జరిగింది. హైదరాబాద్ రాజేంద్రనగర్ కు చెందిన ఓ భక్తుడు శ్రీవారి దర్శనం కోనం తిరుమల వెళ్లారు. స్వామివారి దర్శనం అనంతరం లడ్డూలు కొనుగోలు చేశారు. అనంతరం హైదరాబాద్ చేరుకున్న ఆయన... దేవుడి ప్రసాదాన్ని బంధుమిత్రులకు పంచే క్రమంలో ఒక లడ్డూలో ఇనుప ముక్కను గుర్తించారు. ఎంతో పవిత్రమైన శ్రీవారి లడ్డులో ఇనుప ముక్క కనిపించేసరికి ఆయన ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో, ఆయన ఈ సమాచారాన్ని మీడియాకు అందవేశారు. వెంకటేశ్వరస్వామి లడ్డూ తయారీలో తితిదే నిర్లక్ష్యాన్ని భక్తులు విమర్శిస్తున్నారు.

  • Loading...

More Telugu News