: నేడు స్పీకర్ ను కలవనున్న కాంగ్రెస్ ఎంపీలు
ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ ను కలవబోతున్నారు. ఆగస్టు 2వ తేదీన ఇచ్చిన రాజీనామాలను ఆమోదింపజేసుకోవడానికి వీరు స్పీకర్ తో భేటీ కానున్నారు. తమ రాజీనామాలను ఏమాత్రం నాన్చకుండా వెంటనే ఆమోదించాలని ఎంపీలు విన్నవించుకోనున్నారు. ఈ రోజు స్పీకర్ ను కలవనున్న వారిలో లగడపాటి రాజగోపాల్, అనంత వెంకట్రామిరెడ్డి, సాయిప్రతాప్, ఉండవల్లి అరుణ్ కుమార్, జీవీ హర్షకుమార్, ఎస్పీవై రెడ్డి ఉన్నారు. ఈ నెల 24నే స్పీకర్ అపాయింట్ మెంట్ ఇచ్చినప్పటికీ ఆమె వేరే పర్యటనకు వెళ్లడంతో... ఎంపీలు ఆమెను కలవలేకపోయారు. అయితే, ప్రస్తుతానికి రాయపాటి, ఎస్పీవై రెడ్డి ఢిల్లీలో లేనందున వారు స్పీకర్ ను కలవలేకపోవచ్చని సమాచారం.