: నా భవిష్యత్తు ముఖ్యం కాదు.. రాష్ట్ర భవిష్యత్తే నాకు ముఖ్యం: కిరణ్


పార్టీ పెడితే మహా అయితే మళ్లీ ముఖ్యమంత్రి అవుతాను తప్ప, ప్రధానిని కాలేను కదా? అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తాను ఇప్పుడున్నదే ఆ పదవిలో అన్న విషయాన్ని అందరూ గమనించాలని ఆయన కోరారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నానంటే దానికి కారణం సోనియాగాంధీ అని, తాను పదవుల కోసం పార్టీలు మారే వ్యక్తిని కాదని అన్నారు. పదవి కోసం తాను గడ్డికరిచే మనిషిని కాదని ఆయన అన్నారు. అపోహలు వ్యాప్తి చేయడానికి ఇది సమయం కాదని, మీడియా ప్రతినిధులు సంయమనం పాటించాలని ముఖ్యమంత్రి అన్నారు. దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి జనరల్ సెక్రటరీ అని, ఆయనపై తనకు అపారమైన గౌరవముందని ఆయన అన్నారు. చిన్న పిల్లవాడిని 'నీకు తండ్రి ఇష్టమా? తల్లి ఇష్టమా? అని అడిగినట్టు, తనకు కాంగ్రెస్ పార్టీ ఇష్టమా? లేక సమైక్యరాష్ట్రం ఇష్టమా? అని అడగొద్దని అన్నారు. తనకు రెండూ ఇష్టమని అన్నారు. ఇది ముఖ్యమంత్రి పదవి సమస్య కాదని, రాష్ట్ర విభజన సమస్య అని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News