: సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన చంద్రబాబు
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను తిరస్కరించే హక్కు ఓటర్లకు ఉందన్న సుప్రీంకోర్టు తీర్పును టీడీపీ స్వాగతించింది. హైదరాబాద్ లో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, కోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని, ఎన్నికల సంస్కరణలు, ఓటింగ్ లో పారదర్శకత పెరగాలని టీడీపీ ఆదినుంచీ పోరాడుతోందని అన్నారు. తాను వేసిన అభ్యర్థికే ఓటు పడిందో లేదో తెలుసుకునేందుకు ఓటరుకు కాగితపు ప్రతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.