: పార్టీ టికెట్లు అమ్ముకుంటే చూస్తూ ఊరుకోం


బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య రాజకీయ పార్టీలకు హెచ్చరికలు పంపారు. రానున్న ఎన్నికలలో కేవలం సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే వారికే టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో మాదిరి వ్యాపారవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు టికెట్లు అమ్ముకుంటే చూస్తూ ఊరుకోమని తెలిపారు. అలాంటి పార్టీలపై దాడులు చేసేందుకు కూడా వెనుకాడమని హెచ్చరించారు. ఈ రోజు మెదక్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా, మన దేశంలో రాజకీయ సంస్కరణలు కూడా రావాలని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యే, ఎంపీలను ఎలా ఎన్నుకుంటున్నామో అలాగే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులను కూడా ఎన్నుకునే వ్యవస్థ రావాలని అన్నారు.

  • Loading...

More Telugu News